epaper
Thursday, March 5, 2026
epaper

కలెక్టర్ అంకిత్ ఆన్ డ్యూటీ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు!

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని మణుగూరు (Manuguru)లోని 100 పడకల ఆస్పత్రిని కలెక్టర్ అంకిత్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్‌లోని వివిధ విభాగాలను పరిశీలించిన కలెక్టర్ రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. డాక్టర్లు, ఇతర పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. మందుల లభ్యత ఎలా ఉంది? ఏయే మందులు అందుబాటులో ఉన్నాయి? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఓపీ ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తున్నారని, ఉద్యోగులు బయోమెట్రిక్ ఉపయోగిస్తున్నారా? అనేదానిపై ఆరా తీశారు.

అనంతరం కంటి పరీక్షల విభాగ గదిని, రక్త పరీక్ష కేంద్రాలను, గైనకాలజీ విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో పరిశుభ్రత, అవసరమైన వైద్య పరికరాలు, మందుల నిల్వలు ఎప్పటికపుడు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధ్యతలు చేపట్టిన వారంలోనే కలెక్టర్ అంకిత్ (Collector Ankit) ఆస్పత్రులను తనిఖీ చేస్తుండటం, పేదల పాలిట ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనం అని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read Also: తెలంగాణ IPS కు అమిత్ షా బంపర్ ఆఫర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!