కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) అస్వస్థతకు గురయ్యారు. నేడు అసెంబ్లీ సమావేశాల సమయంలో ఆమెకు కొద్దిగా నలతగా అనిపించడంతో, వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆమెను విజయవాడ(Vijayawada) లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత వారం రోజులుగా నిరంతర సమావేశాలు, వరుస ప్రభుత్వ కార్యక్రమాల కారణంగా హోంమంత్రికి సరైన విశ్రాంతి లేకపోవడం ఆమె నీరసానికి కారణమని తెలుస్తోంది. హోంమంత్రి అనితకు రక్తపోటు (బీపీ) పెరిగినట్టు వైద్యులు తెలిపారు.
ఈరోజు ఉదయం నుంచి ఆమె శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ప్రధానంగా తిరుమల లడ్డూ వ్యవహారంపై జరిగిన చర్చలో కూడా ఆమె భాగమయ్యారు. మండలి సమావేశాలు వాయిదా పడిన తర్వాత, అసెంబ్లీ కొనసాగుతున్న సమయంలో ఆమె అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం హోంమంత్రి అనిత (Vangalapudi Anitha) ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించినట్లు ఆమె వ్యక్తిగత సిబ్బంది స్పష్టం చేశారు. అయితే ఈరోజు సాయంత్రానికే ఆమెను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Read Also: తెలంగాణ IPS కు అమిత్ షా బంపర్ ఆఫర్
Follow Us On : WhatsApp

