epaper
Wednesday, March 4, 2026
epaper

బీజేపీకి 36 శాతమే ఓట్లేశారు : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

కలం, నల్లగొండ బ్యూరో : బీజేపీకి దేశమంతా సపోర్ట్ చేయట్లేదని.. పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 36 శాతమే ఓట్లు వచ్చాయన్నారు ఎంపీ చామల (MP Chamala) కిరణ్ కుమార్ రెడ్డి. 2001లో మోదీ గుజరాత్ కు పారాచ్యూట్‌ సీఎం అయ్యారని విమర్శించారు. మోడీ సీఎం అయినప్పుడు గుజరాత్ ప్రజలకు ఆయనెవరో కూడా తెలియదన్నారు. ఇద్దరు బిల్లా రంగాలు.. మోదీ, అమిత్ షా దేశాన్ని భ్రష్టు పట్టించారని ఎంపీ చామల ఆగ్రహం వ్యక్తం చేశారు.

నరేంద్రమోడీ మెరిట్‌తో ప్రధాని కాలేదని, 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 36 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. 2004లో రాహుల్ గాంధీని (Rahul Gandhi) కేంద్రమంత్రి పదవి తీసుకోవాలని కోరినప్పటికీ తీసుకోలేదని ఎంపీ చామల (MP Chamala) గుర్తు చేశారు. 2009లో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి పదవి తీసుకోమన్నా నాకు అనుభవం లేదని వద్దన్నారని చామల చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలా వద్దా అనేది దేశ ప్రజలు నిర్ణయిస్తారని చెప్పుకొచ్చారు. దేశానికి దశ, దిశ రాజ్యాంగం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ అని, దేశానికి బీజేపీ చేసిందేం లేదని విమర్శించారు ఎంపీ చామల.

తెలంగాణను బీఆర్ఎస్ పదేళ్లు దోచుకుంటే కిషన్ రెడ్డి ఏం చేశారని, బీఆర్ ఎస్ స్కాములపై ఈడీ, సీబీఐ విచారణ ఎందుకు చేయట్లేదని మండిపడ్డారు ఎంపీ చామల. బీఆర్ఎస్ హయాంలో చీకటి జీవోలు ఇచ్చారని, కాళేశ్వరంలో బీఆర్ఎస్ పార్టీ రూ.లక్ష కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తే కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందన్నారు. పదేండ్లలో కేసీఆర్ కుటుంబానికో.. కిషన్ రెడ్డికో నష్టం జరగలేదని.. తెలంగాణ ప్రజలకు నష్టం జరిగిందని చామల కిరణ్ కుమార్ ఆరోపించారు. హైదరాబాద్ లో ట్రిపుల్ ఆర్, మెట్రో ఫేజ్ 2, మూసీ ప్రక్షాళన జరగకుండా బీఆర్ ఎస్, కాంగ్రెస్ అడ్డుపడుతున్నాయని విమర్శలు గుప్పించారు.

Read Also: ఈ నెల 14న హుజూర్‌నగర్‌కు సీఎం రేవంత్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!