epaper
Wednesday, March 4, 2026
epaper

కాసులు కురిపిస్తున్న ‘స్లమ్‘ టూరిజం.. పేదరికం చూపిస్తే 2 గంటలకే రూ. 15,000!

కలం, వెబ్ డెస్క్: ముంబై (Mumbai)లోని ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారావి (Dharavi)ని చూసేందుకు విదేశీ పర్యాటకులు భారీగా ఆసక్తి చూపుతున్నారు. సాధారణంగా పర్యాటక ప్రాంతాలంటే చారిత్రక కట్టడాలు లేదా ప్రకృతి అందాలు ఉంటాయి. కానీ ఇక్కడ ధారావిలోని జీవనశైలిని, అక్కడి కుటీర పరిశ్రమల పనితీరును ప్రత్యక్షంగా చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో గైడ్లు ఒక్కో పర్యాటకుని నుంచి కేవలం రెండు గంటల పర్యటన కోసం సుమారు రూ. 15,000 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

ఈ ‘స్లమ్ టూరిజం’ అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. పర్యాటకులు అక్కడి కష్టపడే తత్వాన్ని చూసి స్ఫూర్తి పొందుతున్నారని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం పేదరికాన్ని కూడా ఒక వ్యాపారంగా మార్చడంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. విదేశీయులు ఈ ప్రాంతాన్ని సందర్శించి సెల్ఫీలు దిగుతున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం స్లమ్ టూరిజం టాపిక్ సోషల్ మీడియాలో  వైరల్‌గా  మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!