Mobile Popup Ad
Mobile Popup Ad

ఇరాన్ బాలికల మృతిపై కేటీఆర్ ఎమోషనల్

కలం, వెబ్ డెస్క్ : ఇరాన్ లో (Iran) ఒకే స్కూల్ కు చెందిన 165 మంది బాలికలు మరణించడం ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్-అమెరికా యుద్ధంలో వేలాది మంది మరణిస్తున్నారు. ఇరాన్ లోని మినాబ్ పట్టణంలో ఉన్న ఓ స్కూల్ మీద ఇజ్రాయెల్-అమెరికా బాంబులు వేయడంతో.. 180 మంది చిన్నారులు చనిపోయారు. అందులో 165 మంది బాలికలే ఉండటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ బాలికలందరినీ ఒకే దగ్గర పూడ్చి పెట్టేందుకు ఇరాన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. బాలికలను పూడ్చి పెట్టేందుకు తీసిన గోతుల ఫొటోలను ఇరాన్ పోస్టు చేసింది. అవి ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేస్తున్నాయి. తాజాగా బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కూడా ఈ ఫొటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు.

ఈ ఫొటోలు భయంకరమైన పరిస్థితులను చూపిస్తున్నాయి. ఇరాన్ లోని ఒక స్కూల్ పై ఇజ్రాయెల్/అమెరికా చేసిన దాడుల్లో 165 మంది అమ్మాయిలు చనిపోవడం చాలా బాధాకరం. దీనికి ఉద్దేశం ఏదైనా.. ఇది మానవులు నింపిన విషాదం. ఇలాంటివి రాబోయే యుగాలకు బాధ, దుఃఖాన్ని మాత్రమే ఇస్తాయి’ అంటూ చెప్పుకొచ్చారు కేటీఆర్ (KTR).

Read Also: లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత గణపతి..?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>