కలం, వెబ్ డెస్క్: ఏపీ శాసన మండలి (AP Legislative Council) సమావేశాల్లో మరోసారి గందరగోళం నెలకొంది. మండలి చైర్మన్ మోషేన్ రాజు (Moshen Raju) తిరుమల లడ్డూపై చర్చను ప్రారంభించగా వైసీపీ సభ్యులకు, కూటమి సభ్యులకు వాదోపవాదాలు కొనసాగాయి. ఇదే సందర్భంలో మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) మతపర వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదానికి దారి తీసింది. మంత్రి అచ్చెన్నాయుడు మీరు, మీ నాయకుడు అంతా క్రిస్టియన్లు అని వ్యాఖ్యానించారు.
దీనిపై చైర్మన్ మోషేన్ రాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా మీరు క్రిస్టియన్ కాదా అని మంత్రి చైర్మన్‌ను ప్రశ్నించారు. మీరు క్రిస్టియన్ కాదని సభా వేదికగా చెప్తే నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటానని వెల్లడించారు. దీంతో చైర్మన్ తాను క్రిస్టియన్ కాదని, హిందువునని స్పష్టం చేశారు. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పారు.
Read Also: పశ్చిమాసియా యుద్ధం.. హెల్ప్ లైన్ నెంబర్లు ఇవిగో : కేంద్రం
Follow Us On: Instagram

