కలం, నాగార్జునసాగర్: న్యాయశాఖ ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేసినప్పుడే న్యాయవ్యవస్థ ప్రతిష్ట పెరుగుతుందని తెలంగాణ లోకాయుక్త న్యాయమూర్తి రాజశేఖర్ రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్(Nagarjuna sagar) నియోజకవర్గంలో ఒక కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చిన తెలంగాణ లోకాయుక్త న్యాయమూర్తి రాజశేఖర్ రెడ్డిని స్థానిక విజయ విహార్ అతిథిగృహంలో మంగళవారం న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మాతంగి వీరబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం నాయకులతో లోకాయుక్త న్యాయమూర్తి పలు విషయాలపై సలహాలు సూచనలు ఇచ్చారు. లోకాయుక్త న్యాయమూర్తిని కలిసిన వారిలో న్యాయశాఖ ఉద్యోగుల సంఘం నాయకులు గిరి, సాగర్, మహేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

