Mobile Popup Ad
Mobile Popup Ad

బాచుప‌ల్లిలో భారీ అగ్ని ప్ర‌మాదం.. రూ.కోట్ల‌లో ఆస్తి న‌ష్టం

క‌లం, వెబ్ డెస్క్‌: హైద‌రాబాద్‌లోని బాచుప‌ల్లి (Bachupally)లో భారీ అగ్ని ప్ర‌మాదం (Fire Accident) జ‌రిగింది. ప్ర‌గ‌తిన‌గ‌ర్‌లో వ‌రుస‌గా ఏర్పాటు చేసిన ఫ‌ర్నీచ‌ర్ షాపుల్లో (Furniture Shops) ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్ర‌మాదంలో భారీ ఎత్తున ఫ‌ర్నీచ‌ర్ ధ్వంసం కావ‌డంతో రూ.కోట్ల‌లో ఆస్తి న‌ష్టం జ‌రిగింది. షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఘ‌ట‌న‌లో 50కి పైగా షాపులు పూర్తిగా దగ్ధమ‌య్యాయి. ఒక్కో షాపులో దాదాపు రూ.40 లక్షల విలువైన ఫర్నీచర్ సామాగ్రి ఉన్న‌ట్లు స‌మాచారం. మంట‌ల‌ను ఆర్పేందుకు దాదాపు ఐదు గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వ‌హించారు. అనంత‌రం మంటలు అదుపులోకి వ‌చ్చాయి. ఘ‌ట‌న‌లో ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కళ్ల ముందే తమ జీవనాధారం బుగ్గిపాలు కావడంతో ఈ షాపులు నిర్వహించే చిరు వ్యాపారులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>