epaper
Tuesday, March 3, 2026
epaper

జర్నలిస్ట్ మూర్తి సస్పెండ్.. మంచు లక్ష్మి రియాక్షన్ ఇదే!

కలం, వెబ్ డెస్క్: సీనియర్ జర్నలిస్ట్ వీఎస్‌ఎన్ మూర్తి (VSN Murthy)ని తెలుగు ఫిల్మ్ జర్నలిస్టుల అసోసియేషన్ మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తోటి జర్నలిస్టుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడంపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అసోసియేషన్ ఈ చర్యలు చేపట్టింది. అలాగే గతంలో మూర్తి అడిగిన కొన్ని వ్యక్తిగత ప్రశ్నలపై నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi) తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు కూడా చేశారు.

ఈ సస్పెన్షన్‌పై స్పందిస్తూ మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అతని ప్రవర్తనకు తగిన ప్రతిఫలం దక్కిందని, ఎవరికైనా చేసే పనుల వల్ల వచ్చే ఫలితం ఇలాగే ఉంటుందని ఆమె కామెంట్స్ చేశారు. వృత్తిలో గౌరవప్రదంగా మెలగడం ముఖ్యమని, పరిధులు దాటితే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని మంచు లక్ష్మి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!