epaper
Tuesday, March 3, 2026
epaper

యుద్ధం దెబ్బ.. క్రికెట్ సిరీస్‌లు రద్దు

కలం, స్పోర్ట్స్: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం క్రికెట్‌పైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టుకు ఉన్న పలు పర్యటనలను రద్దు చేసింది. పలు దేశాలు తమ గగనతలం మూసివేయడంతో క్రీడాకారులను స్వదేశానికి చేర్చడం కోసం అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. యూఏఈ వేదికగా పాకిస్థాన్ షాహీన్స్‌తో జరుగుతున్న ఇంగ్లాండ్ (England) లయన్స్ వన్డే సిరీస్‌ను ఈసీబీ మధ్యలోనే ఆపేసింది.

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కేవలం మొదటి మ్యాచ్ మాత్రమే పూర్తయింది. రెండో మ్యాచ్‌ను వాయిదా వేసి, మిగిలిన మూడు మ్యాచ్‌లను పూర్తిగా రద్దు చేశారు. అలాగే, రాబోయే మహిళల టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) కోసం అబుదాబీ (Abu Dhabi)లో జరగాల్సిన ఇంగ్లాండ్ మహిళల జట్టు (England Team) ట్రైనింగ్ క్యాంపును కూడా రద్దు చేశారు. గల్ఫ్ ప్రాంతంలో అస్థిరత దృష్ట్యా అక్కడ ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించే అవకాశం లేదని బోర్డు స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయ మార్గాల కోసం కసరత్తు చేస్తున్నట్లు తెలిపింది.

Read Also: ఇరాన్ ప్లేయర్ల సైలెంట్ ప్రొటెస్ట్.. జాతీయ గీతం పాడకుండా నిరసన

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!