ఇరాన్ ప్లేయర్ల సైలెంట్ ప్రొటెస్ట్.. జాతీయ గీతం పాడకుండా నిరసన

కలం, స్పోర్ట్స్ డెస్క్: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్‌లో ఇరాన్ (Iran) మహిళా సాకర్ జట్టు సంచలన నిర్ణయం తీసుకున్నది. తమ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న నేపథ్యంలో.. దక్షిణకొరియాతో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో ఇరాన్ క్రీడాకారిణులు తమ జాతీయ గీతం పాడకుండా మౌనంగా నిరసన వ్యక్తం చేశారు.

గోల్డ్ కోస్ట్ లోని సిబస్ సూపర్ స్టేడియంలో జాతీయ గీతం ప్లే అవుతున్న సమయంలో.. క్రీడాకారిణులు, హెడ్ కోచ్ మర్జియా జాఫరీగానీ గొంతు కలపలేదు. సైలెంట్గా నిలబడి తమ నిరసనను ప్రపంచానికి తెలియజేశారు. ఆ తర్వాత మైదానంలో జరిగిన పోరాటంలో దక్షిణ కొరియా 3-0 తేడాతో ఇరాన్ పై (Irtan) విజయం సాధించింది.

కొరియా క్రీడాకారిణులు చోయ్ యూ-రీ, కిమ్ హ్యే-రీ, కో యూ-జిన్ తలో గోల్ చేసి తమ జట్టుకు విజయాన్ని అందించారు. ఓటమి ఎదురైనప్పటికీ, తన జట్టు కనబరిచిన పోరాట పటిమపై కోచ్ జాఫరీ సంతృప్తి వ్యక్తం చేశారు. ‘దక్షిణ కొరియా ఆసియాలోనే అత్యంత బలమైన జట్లలో ఒకటి. సెకండ్ హాఫ్లో మేం ఒత్తిడి పెంచాం. కొన్ని వ్యక్తిగత తప్పిదాలతో గోల్స్ సమర్పించుకున్నాం. కానీ, జట్టు ప్రదర్శన మాత్రం అద్భుతంగా ఉంది’’అని ఆమె పేర్కొన్నారు.

Read Also: సీఎం vs సివిల్ సర్వెంట్స్.. సమస్య ఎటు దారితీయనుంది?

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>