epaper
Tuesday, March 3, 2026
epaper

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కలం, వెబ్ డెస్క్ : యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలో ఉదయాన్నే ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం(Dandu Malkapur) జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని నిడదవోలు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, రహదారిపై ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనలో పది మంది ప్రయాణికులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!