epaper
Tuesday, March 3, 2026
epaper

44 స్కూళ్లలో స్కాలర్ షిప్స్ ఇస్తా.. విజయ్ కీలక ప్రకటన

కలం, డెస్క్ : స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. ఫిబ్రవరి 26వ తేదీన రష్మిక మందన్నతో విజయ్ కు (Vijay Deverakonda) మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం తుమ్మన్ పేటకు విజయ్, రష్మిక కుటుంబ సమేతంగా వచ్చారు. అక్కడ కొత్తగా కట్టిన ఫామ్ హౌస్ లో సత్యనారాయణ వ్రతం చేశారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. ‘తుమ్మన్ పేట నుంచి మా ఫ్యామిలీ 30 ఏళ్ల కిందే వెళ్లిపోయినా.. ఎన్నో విడదీయరాని అనుబంధాలు ఇక్కడే ఉన్నాయి. నా ఫస్ట్ బర్త్ డే కూడా ఇక్కడే నిర్వహించారు’ అంటూ తెలిపాడు విజయ్.

ఈ విద్యా సంవత్సరం తుమ్మన్ పేట హైస్కూల్ లో 9, 10వ తరగతుల్లో ఫస్ట్, సెకండ్ ర్యాంకులు వచ్చిన స్టూడెంట్లకు స్కాలర్ షిప్ ఇస్తానని ప్రకటించాడు. అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అచ్చంపేట డివిజన్‌ పరిధిలో 44 స్కూళ్లలో దీన్ని అమలు చేస్తానని తెలిపాడు. అనంతరం గ్రామస్తులకు విందు ఏర్పాటు చేసింది విజయ్ కుటుంబం. ఈ నెల 4వ తేదీన హైదరాబాద్ లో గ్రాండ్ గా విజయ్-రష్మిక రిసెప్షన్ జరగబోతోంది. దీనికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!