కలం, వెబ్ డెస్క్: సహజీవనం చేస్తున్న ప్రియుణ్ని దారుణంగా నరికి చంపిందో నటి(Urmila Alias Bindu). హత్య చేసేటపుడు అరుపులు బయటకు వినిపించకుండా నోటిని టేప్‌తో చుట్టి మరీ ఈ ఘాతుకానికి పాల్పడింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమ పక్కింటి నుంచి దుర్వాసన వస్తోందంటూ మంజునాథ్ నగర్‌కు చెందిన ఓ కుటుంబం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ ఇంటికి వెళ్లి చూడగా, మోహన్ కృష్ణ రావు(40) మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. కాళ్లూ చేతులు కట్టేసి, నోటికి టేపు చుట్టి, నగ్నంగా చేసి, కత్తులతో విచక్షణారహితంగా పొడిచినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు.. మోహన్ కృష్ణ రావుతో సహజీవనం చేస్తున్న టీవీ, సినిమా నటి ఊర్మిళ అలియాస్ బిందు కనిపించడం లేదని గుర్తించారు. వెంటనే సెర్చ్ చేసి ఆమెతోపాటు వినయ్, ధనుష్ గౌడను అరెస్ట్ చేశారు. విచారణలో వాళ్లు నేరాన్ని అంగీకరించారు.
కాగా, భార్యను వదిలిపెట్టిన మోహన కృష్ణ కొంతకాలంగా బిందుతో (Urmila Alias Bindu) సహజీవనం చేస్తున్నారు. అయితే, ఇటీవల ఆమెకు స్థానికంగా ఉండే లారీ డ్రైవర్ వినయ్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో వినయ్‌ని పెళ్లి చేసుకోవాలనుకున్న బిందు.. విషయాన్ని మోహన కృష్ణకు చెప్పింది. అతను అంగీకరించకపోవడంతో వినయ్, ధనుష్ గౌడతో కలసి గత నెల 18న దారుణంగా హత్య చేసింది. అనంతరం పరారైంది. ప్రియుణ్ని దారుణంగా హత్య చేసిన ఆమె అదే రోజు రాత్రి పబ్‌లో పార్టీ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
Read Also: పరుగులు చేయలేకపోతే తప్పుకోవాల్సిందే.. అభిషేక్‌పై నాయర్ హాట్ కామెంట్స్
Follow Us On: Instagram

