కలం, ఖమ్మం బ్యూరో: హోళీ వేడుకల్లో ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇతరులపై బలవంతంగా రంగులు చల్లడం, నీటి బెలూన్లు విసరడం లాంటివి చేయొద్దని హెచ్చరించారు. ప్రార్థనా మందిరాలు, బహిరంగ ప్రదేశాలు, రహదారులపై వాహనదారులకు ఆటంకం కలిగించే విధంగా ప్రవర్తించవద్దని సూచించారు.
ఎవరైనా ఆకతాయిలు వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇందుకోసం షీ టీమ్ (SHE Teams) బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటుచేశామని, ప్రధాన కూడళ్లు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిఘా బృందాలను ఏర్పాటు చేస్తునట్లు తెలిపారు. హోళీ (Holi) పండుగ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదని, జిల్లావ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈతరాని వారు చెరువులు, కుంటలు, కాలువల వద్దకు వెళ్లకూడదని సూచించారు.
Read Also: సీఎం వర్సెస్ సివిల్ సర్వెంట్స్.. ఆగ్రహం, అనుగ్రహం ఎవరిపై?
Follow Us On: X(Twitter)

