బాల్క సుమన్ కు బెయిల్ మంజూరు

కలం, డెస్క్ : బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు (Balka Suman) మంచిర్యాల జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి, బీఆర్ ఎస్, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 18వ తేదీన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కాన్వాయ్ పై దాడి కేసులో పోలీసులు బాల్క సుమన్ (Balka Suman) ను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి రిమాండ్ లోనే ఉంటున్న సుమన్ కు.. తాజాగా బెయిల్ వచ్చింది. అయితే ప్రతి ఆదివారం రామకృష్ణపూర్‌ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకం పెట్టాలని కోర్టు షరతు విధించింది. ఈ కేసులో అరెస్ట్ అయిన మిగిలిన వారంతా ప్రస్తుతం ఆదిలాబాద్ జైల్లోనే ఉన్నారు.

Read Also: డిజిటల్ హెల్త్ కార్డు.. ఫోటో, క్యూఆర్ కోడ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>