epaper
Monday, March 2, 2026
epaper

ప్లాన్ మార్చిన ఇరాన్.. గల్ఫ్ దేశాల్లో వారే టార్గెట్

కలం, డెస్క్ : ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్-అమెరికా వార్ భీకరంగా సాగుతోంది. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలతోపాటు ఇజ్రాయెల్ మీద ఇరాన్ (Iran) దాడులు నిర్వహించింది. అయితే ఇప్పుడు కొత్త వ్యూహం అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. గల్ఫ్‌ దేశాల్లోని యూఎస్ ఆర్మీ స్థావరాలతో పాటు.. ఇరాన్ కు వ్యతిరేకంగా ఉన్న వారిపై కూడా దాడులు చేస్తోంది. హైరైజ్ బిల్డింగులు, షాపింగ్ మాల్స్ తో పాటు ఇతర కమ్యూనిటీ సెంటర్లపై దాడులు నిర్వహిస్తోంది ఇరాన్ (Iran). దీంతో గల్ఫ్ దేశాల్లోని అనేక హైరైజ్ బిల్డింగులు, అపార్టుమెంట్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.

ఇక గల్ఫ్ దేశాల్లో ఇండియన్లు కోటి మందికి పైగా ఉన్నారు. వారంతా తగిన సూచనలు పాటించాలని ఇప్పటికే ఇండియా ప్రకటించింది. అక్కడ సేఫ్ ప్లేసుల లిస్టును కూడా అందించింది. గల్ఫ్‌ దేశాల్లోని ఇండియన్ ఎంబసీ (Indian Embassy) ఎప్పటికప్పుడు అక్కడి వారి పరిస్థితిని తెలుసుకుంటోంది. ఎవరికి ఎలాంటి సహాయ, సహకారాలు కావాలన్నా సరే అందిస్తోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Read Also: ఇరాన్‌లో యుద్ధంతో ‘బాస్మతి’ ధరలు పతనం.. ఆందోళనలో హర్యానా రైతాంగం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!