కలం, వెబ్ డెస్క్: తెలంగాణపై సూర్య ప్రతాపం మొదలైంది. రానున్న మూడు నెలలపాటు రాష్ట్రంలో ఎండల తీవ్రత (Heat Wave) భారీగా పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన వాడగాల్పులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
వచ్చే మూడు రోజుల్లోనే రాష్ట్రంలో (Telangana) పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎండల తీవ్రత దృష్ట్యా మధ్యాహ్నం వేళల్లో బయటకు వచ్చేవారు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
Read Also: అలెర్ట్.. ట్రెండ్ మైక్రో అపెక్స్ వన్‌లో తీవ్ర లోపాలు!
Follow Us On : WhatsApp

