పెద్ది : సెకండ్ సింగల్ బిగ్ అప్డేట్..

కలం, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన (Buchi Babu Sana) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “పెద్ది”(Peddi). ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 30, 2026 న పెద్ది మూవీ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ వరుస అప్డేట్స్ ప్లాన్ చేస్తున్నారు. నేడు పెద్ది మూవీ సెకండ్ సింగల్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ (AR Rahman) మ్యూజిక్ అందిస్తుండటంతో.. ఫ్యాన్స్ లో ఈ సాంగ్ పై మరింత ఎగ్జైట్‌మెంట్ ఏర్పడింది.

ఇప్పటికే రిలీజ్ అయిన ‘చికిరీ చికిరీ’ సాంగ్ ట్రెండింగ్ కావడంతో.. సెకండ్ సింగిల్ “రయ్ రయ్ రా రా ” సాంగ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ సాంగ్ పై మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. నేడు సాయంత్రం 7.02 గంటలకు పెద్ది (Peddi) సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాదు ఈ సాంగ్‌ని ఏఆర్ రెహమాన్ పాడినట్లు ప్రకటించారు. అలాగే ఈ సాంగ్ లో కూడా చరణ్  అదిరిపోయే స్టెప్స్ వేయనున్నట్లు తెలుస్తుంది. తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

Read Also: సతీమణితో స్వగ్రామం చేరుకున్న విజయ్ దేవరకొండ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>