కలం, వెబ్ డెస్క్: ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త వ్యూహాలతో ఇరాన్ (Iran)మిలిటరీ నాయకులపై భారీ దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి చెందాడు. మరో వైపు తాత్కాలిక సుప్రీం లీడర్‌గా నియామకమైన అలి రెజా కూడా మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో దేశంలోని పలువురు ఉన్నత మిలిటరీ కమాండర్లు మరణించినట్లు వార్తలు ఊపందుకున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వివరాల ప్రకారం ఇరాన్ నేవీ చీఫ్ శహ్రం ఇరానీ (Iran Navy Chief Shahram Irani) కూడా ఈ దాడుల్లో హతమైనట్టు సమాచారం. దీనిపై ఇరాన్ అధికారిక మీడియా నుంచి ఇంకా ప్రకటన విడుదల కాలేదు.
Read Also: ఇరాన్ న్యూక్లియర్ సైట్‌పై దాడులు
Follow Us On: Youtube

