కలం, వెబ్ డెస్క్: అమెరికాతో చర్చల ప్రసక్తే లేదని ఇరాన్ (Iran) తేల్చి చెప్పేసింది. అమెరికా(US) చేసిన పనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని వెల్లడించింది. ఆదివారం ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ (Khamenei) మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై ఇరాన్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ సందర్భంగా ట్రంప్ చర్చలపై చేసిన వ్యాఖ్యలను ఇరాన్ తోసిపుచ్చింది. తాము చర్చల కోసం ఎవరినీ సంప్రదించలేదని వెల్లడించింది.
మరోవైపు ఇరాన్ ఊహించని రీతిలో దాడులకు తెగబడుతోంది. ఇరాన్ దాడిలో యూఏఈలోని అమెజాన్ డేటా సెంటర్ భారీగా దెబ్బతిన్నది. కువైట్‌పై 97 క్షిపణులు, 283 డ్రోన్లతో ఇరాన్ దాడికి పాల్పడింది. ఇరాన్ మిసైళ్ల ప్రయోగంతో ఇజ్రాయెల్‌లో సైరన్లు మోగుతున్నాయి. ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై (American Bases) ఇరాన్ నిరంతరంగా క్షిపణుల దాడి కొనసాగిస్తున్నది. మరోవైపు ఇరాన్‌పైనా ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. మొత్తం 27 అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేపట్టింది.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ విజయవంతంగా కొనసాగుతోందని ట్రంప్ వెల్లడించారు. తాము ఊహించిన దాని కంటే వేగంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. ఈ దాడుల్లో 48 మంది ఇరాన్ (Iran) నేతలు చనిపోయినట్లు పేర్కొన్నారు. మెహ్రాన్ క్షిపణి దాడిలో 43 మంది ఇరాన్ భద్రతా సిబ్బంది మృతి చెందినట్లు సమాచారం. ఇరాన్‌లోని బాలికల పాఠశాలలో జరిగిన క్షిపణి దాడిలో మృతుల సంఖ్య 165కు చేరుకున్నది.
Read Also: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత.. ఢిల్లీ తెలంగాణ భవన్లో 24×7 కంట్రోల్ రూమ్
Follow Us On: Sharechat

