epaper
Monday, March 2, 2026
epaper

నల్లగొండ అంటేనే రాజకీయాల్లో టైగర్ జోన్ :ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

కలం, నల్లగొండ బ్యూరో : నల్లగొండ (Nalgonda) జిల్లా అంటేనే రాష్ట్ర రాజకీయాల్లో టైగర్ జోన్ అని, రాష్ట్ర రాజకీయాలను శాసించే జిల్లా అని..  మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Raj Gopal Reddy) తెలిపారు. మునుగోడు (Munugodu) లోని దుబ్బ కాలువ రోడ్డులో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ (Young India Integrated School) నిర్మాణానికి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి రాజగోపాల్ రెడ్డి భూమిపూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 79 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయని, దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు చదువుకోబోతున్నారని తెలిపారు. మేం చిన్నతనంలో చదువుకునేటప్పుడు కులాల గురించి తెలియదని, అన్నికులాలు, అన్ని మతాలవారు ఒకే ప్రాంగణంలో చదువుకునేవాళ్లమని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ సైతం అలాంటి పాఠశాలలేనని కొనియాడారు.

కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని, దేశంలో ఏ రాష్ట్రంలో చేయలేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పథకాన్ని తీసుకొచ్చిందని అన్నారు. ఈ స్కూళ్లు పూర్తయిన తర్వాత దేశంలోని ప్రతి రాష్ట్రం తెలంగాణ వైపే చూస్తుందని, రాబోయే రెండేళ్లలో స్కూల్ నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. యావత్ తెలంగాణలో 76.35 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే.. ప్రైవేటు స్కూళ్లలో 44 లక్షల మంది చదువుతుండగా, ప్రభుత్వ స్కూల్స్‌లో 24 లక్షల మంది చదువుతున్నారని వివరించారు. విద్య మొత్తం కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లిపోయిందని, కనీసం 50 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే అవకాశం రావాలని చెప్పారు. బడ్జెట్‌లో విద్య కోసం 15 శాతం కేటాయిస్తే.. అది సాధ్యమవుతుందని అన్నారు.  మునుగోడు నియోజకవర్గంలో 330 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే.. అందులో కేవలం 9700 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని చెప్పుకొచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!