కలం, డెస్క్ : టీ20 వరల్డ్ కప్ 2026లో ఇండియా–వెస్టిండీస్ (India Vs West Indies) మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వాళ్లు సెమీస్‌కు వెళ్తారు. ఈ క్రమంలో విండీస్, ఇండియా మధ్య చావోరేవో అన్న వాతావరణం నెలకొంది. సెమీఫైనల్ ఆశలు నిలవాలంటే ఇరు జట్లకూ గెలుపు చాలా ముఖ్యం. ఈ మ్యాచ్‌లో ఫలితాన్ని మార్చే ప్లేయర్లపై ప్రత్యేక దృష్టి పడింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా పోరు జరగనుంది.
వెస్టిండీస్ తరఫున షిమ్రాన్ హెట్మ్యేర్ డేంజరస్ బ్యాటర్‌గా కనిపిస్తున్నాడు. టాప్ ఆర్డర్‌లోకి వచ్చిన తర్వాత వేగంగా పరుగులు చేస్తున్నాడు. తక్కువ బంతుల్లోనే మ్యాచ్ మలుపు తిప్పగలడు. అతడిని ఆపడం జస్ప్రిత్ బుమ్రాకు కీలకంగా మారుతుంది.
భారత్ తరఫున హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కీలక పాత్ర పోషిస్తున్నాడు. చివరి ఓవర్లలో వేగంగా పరుగులు సాధిస్తూ జట్టుకు బలం ఇస్తున్నాడు. అతడిని నిలువరించేందుకు జాసన్ హోల్డర్‌ను ఉపయోగించే అవకాశం ఉంది.
వెస్టిండీస్ కెప్టెన్ షైహోప్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. క్రీజులో నిలిస్తే పెద్ద స్కోరు సాధించే ఛాన్స్ ఉంటుంది. అతడికి వరుణ్ చక్రవర్తి నుంచి కఠిన సవాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో (India Vs West Indies) ఈ ప్లేయర్ల ప్రదర్శన చాలా కీలకం కానుంది. ఎవరు మెరుగ్గా ఆడతారో అదే ఫలితాన్ని నిర్ణయించే అవకాశం ఉంది.
Read Also: ఇరాన్లో యుద్ధంతో ‘బాస్మతి’ ధరలు పతనం.. ఆందోళనలో హర్యానా రైతాంగం
Follow Us On: X(Twitter)

