epaper
Sunday, March 1, 2026
epaper

యూకే సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి.. పశ్చిమాసియాను దాటిన యుద్ధం

కలం, డెస్క్ : ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం (Iran) పశ్చిమ ఆసియాను దాటుతోంది. ఇరాన్ తన చుట్టూ ఉన్న దేశాల్లోని యూఎస్ సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇప్పటి దాకా దాడులు జరిపింది. అయితే ఇప్పుడు యూకేకు (UK) షాక్ ఇచ్చింది. సైప్రస్ లోని యూకే సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు ప్రయోగించింది ఇరాన్. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున యూకే సైనిక స్థావరాలు ధ్వంసం అయినట్టు తెలుస్తోంది. అటు యూకే ఈ దాడులను ధృవీకరించింది.

దీంతో యుద్ధ వాతావరణం (Iran) మరింత వేడెక్కినట్టే కనిపిస్తోంది. యూకే కూడా యుద్ధంలోకి దిగుతుందా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. అటు అమెరికా-ఇజ్రాయెల్ దాడులను కంటిన్యూ చేస్తున్నాయి. ఇరాన్ కూడా పెద్ద ఎత్తున డ్రోన్లు, మిస్సైళ్లతో ఇజ్రాయెల్, గల్ఫ్‌ దేశాల్లోని యూఎస్ సైనిక స్థావరాలపై విరుచుకుపడుతోంది.

Read Also: హైదరాబాద్‌లో మరో ప్రతిష్టాత్మక టోర్నమెంట్

Follow Us On : WhatsApp

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!