epaper
Sunday, March 1, 2026
epaper

విడాకుల వేళ‌ విజ‌య్‌కి షాకిచ్చిన కొడుకు!

క‌లం, వెబ్ డెస్క్‌: టీవీకే పార్టీ అధినేత దళపతి విజ‌య్ (Thalapathy Vijay) కుటుంబ వ్య‌వ‌హారం హాట్‌టాపిక్‌గా మారింది. రాజ‌కీయ పార్టీ (TVK) పెట్టి త‌మిళ‌నాడు సీఎం అవుదామ‌నుకుంటున్న విజ‌య్‌కి సొంత ఫ్యామిలీ నుంచే వ‌రుస షాక్‌లు త‌గులుతున్నాయి. తాజాగా విజ‌య్ భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్ట్‌లో పిటిష‌న్ దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. విజ‌య్‌కి ఓ న‌టితో అక్ర‌మ సంబంధం ఉంద‌ని ఈ కార‌ణంగానే విడాకులు కోరుతున్న‌ట్లు ఆమె పిటిష‌న్‌లో పేర్కొంది. ఈ అంశం త‌మిళ రాజ‌కీయాల్లో తీవ్ర క‌ల‌క‌లం రేపింది.

గ‌తంలో ఓ బీజేపీ నేత విజ‌య్‌ని ఉద్దేశిస్తూ విజ‌య్ ముందు త్రిష ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని, అప్పుడే రాజ‌కీయం చేయాల‌ని బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో త్రిష గురించే సంగీత ఆరోప‌ణ‌లు చేసింద‌న్న చ‌ర్చ ఊపందుకున్న‌ది. ఈ త‌రుణంలో విజ‌య్ కొడుకు జాస‌న్ సంజ‌య్ (Jason Sanjay) కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. విజ‌య్‌ని ఇన్‌స్టాగ్రామ్ స‌హా అన్ని సోష‌ల్ మీడియా ఖాతాల నుంచి అన్ ఫాలో చేశాడు. త‌ల్లికి స‌పోర్ట్‌గా నిలిచేందుకే జాస‌న్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఆయ‌న ముందు నుంచే విజ‌య్‌ని సోష‌ల్ మీడియాలో ఫాలో అవ‌డం లేద‌ని ప‌లువురు కామెంట్ చేస్తున్నారు. ఒక వేళ విజ‌య్‌ (Thalapathy Vijay), సంగీత విడాకులు ఖాయ‌మైతే జాస‌న్ ఎవ‌రికి మ‌ద్ద‌తుగా ఉంటాడ‌న్న‌ది వేచి చూడాలి.

Read Also: ఐదున్నర దశాబ్దాల తర్వాత సొంతూరికి మల్లోజుల

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!