కలం, వెబ్ డెస్క్ : తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ (TTD Chairman) బీఆర్ నాయుడు తీవ్రంగా ఖండించారు. ఇటీవల బయటకు వచ్చిన కొన్ని అభ్యంతరకర వీడియోలపై ఆయన స్పందిస్తూ, అవన్నీ కృత్రిమ మేధ (AI) సాయంతో సృష్టించిన నకిలీ డీప్ ఫేక్ వీడియోలని తెలిపారు. వ్యక్తిగతంగా తనను అప్రతిష్టపాలు చేసేందుకు, టీటీడీ ప్రతిష్టను దిగజార్చేందుకే కొందరు ఈ కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ వివాదం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని బీఆర్ నాయుడు (BR Naidu) అన్నారు. వైసీపీకి చెందిన కొందరు ఈ తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. ఆధునిక సాంకేతికతను వాడుకుని అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే సైబర్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశానని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆయన వివరించారు.
Read Also: వేట్లపాలెం ఘటనలో మరో వ్యక్తి మృతి
Follow Us On: Instagram

