కలం, వెబ్ డెస్క్: కాకినాడ (Kakinada) జిల్లా వేట్లపాలెంలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. దాదాపుగా 20 మంది సజీవదహనం అయినట్టు సమాచారం. ప్రమాద సమయంలో మొత్తం 35 మంది ఉన్నట్టు తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా సూర్యశ్రీ ఫైర్‌వర్క్స్‌లో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించారు.
అధికారులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను ఆరా తీస్తున్నారు. ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా హోంమంత్రిని ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో హోంమంత్రి అనిత ఫోన్‌లో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జగన్ డిమాండ్ చేశారు. వైసీపీ అధినేత జగన్ సైతం ఈ ఘటనపై స్పందించారు. సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధితులకు తక్షణం ఆర్థిక సహాయం చేయాలని కోరారు.
Read Also: ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలి : గరికిపాటి నరసింహారావు
Follow Us On: Pinterest

