కలం, వెబ్ డెస్క్ : కాకినాడ జిల్లా సామర్లకోట (Samarlakota) మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయ పడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా ఉన్న ఒక బాణాసంచా తయారీ కేంద్రంలో ప్రమాదవశాత్తు నిప్పురవ్వలు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బాణాసంచా తయారు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది.
ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 20 మంది వరకు కార్మికులు లోపల పని చేస్తున్నట్లు సమాచారం. పేలుడు ధాటికి మంటలు భారీగా ఎగిసిపడటంతో పలువురు కార్మికులు లోపలే చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Read Also: సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశాం: సీఎం చంద్రబాబు
Follow Us On: Instagram

