కలం, స్పోర్ట్స్ : టీ20 ప్రపంచకప్ 2026లో (T20 World Cup) పాకిస్థాన్ ప్రస్థానం ముగింపు దశకు చేరుకున్న తరుణంలో, ఆ జట్టు తదుపరి కెప్టెన్ ఎవరనే చర్చ మొదలైంది. ప్రస్తుతం జట్టు గడ్డు పరిస్థితుల్లో ఉన్న వేళ, స్టార్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్‌కు పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi) అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సల్మాన్ అలీ ఆఘా నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు, సూపర్-8లో ఇంగ్లాండ్‌తో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించే స్థితిలో ఉంది. అంతకుముందు 2025 మార్చిలో మహమ్మద్ రిజ్వాన్ స్థానంలో సల్మాన్ బాధ్యతలు చేపట్టారు. ఆయన సారథ్యంలో పాక్ 49 మ్యాచ్‌లు ఆడి 30 విజయాలు సాధించినప్పటికీ, ఆసియా కప్ 2025 ఫైనల్‌తో సహా భారత్‌తో జరిగిన కీలక మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది.
ఒక ప్రైవేట్ ఛానెల్‌తో మాట్లాడిన అఫ్రిది, జట్టులో ప్రస్తుతం కెప్టెన్సీకి ఇతర ప్రత్యామ్నాయాలు తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత కోచ్ మైక్ హెస్సన్ కొనసాగితే, షాదాబ్ ఖాన్‌కే కెప్టెన్సీ దక్కే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. గతంలో మాదిరిగా షాదాబ్ తన బౌలింగ్‌లో నిలకడ ప్రదర్శించి ఉంటే, అతని వాదన ఇంకా బలంగా ఉండేదని అఫ్రిది విశ్లేషించారు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు వ్యక్తిగత ప్రదర్శన కూడా మెరుగ్గా ఉండాలని, అప్పుడే జట్టును ముందుండి నడిపించగలరని అఫ్రిది (Shahid Afridi) సూచించారు. ప్రపంచకప్ తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ నాయకత్వ మార్పులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
Read Also: పాక్ సెమీస్‌కు వెళ్లాలంటే ఇదొక్కటే దారి!
Follow Us On: Instagram

