epaper
Monday, March 2, 2026
epaper

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై అన్నా హజారే రియాక్షన్ ఇదే

కలం, వెబ్ డెస్క్: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో (Delhi Excise Policy Case) అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలను రౌస్ అవెన్యూ కోర్టు నిర్దోషులుగా విడుదల చేసిన నేపథ్యంలో సామాజిక కార్యకర్త అన్నా హజారే (Anna Hazare) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైవిధ్యభరితమైన పార్టీలు, కులాలు, మతాలతో కూడిన మన దేశం న్యాయ, భద్రతా వ్యవస్థల బలంతోనే సజావుగా సాగుతోందన్నారు. న్యాయవ్యవస్థ లేకపోతే దేశంలో అరాచకం, అశాంతి నెలకొనేవని, కోర్టు ఇచ్చిన ఈ తీర్పును అందరూ గౌరవించాలని అన్నా హజారే పేర్కొన్నారు.

అరవింద్ కేజ్రీవాల్‌పై (Arvind Kejriwal) వచ్చిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని కోర్టు స్పష్టం చేసినందున, ఆ తీర్పును ఆమోదించక తప్పదని అన్నా హజారే (Anna Hazare) అభిప్రాయపడ్డారు. ఈ తీర్పు దేశంలో న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని తెలియజేసిందన్నారు. ఎక్సైజ్ పాలసీ కేసులో దాదాపు రెండేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

Read Also : లిక్కర్ క్వీన్ TO క్లీన్ క్వీన్ : కవిత పొలిటికల్ గేమ్ చేంజ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!