epaper
Sunday, March 1, 2026
epaper

సచివాలయానికి మావోయిస్టు అగ్రనేతలు : సీఎంతో కీలక భేటీ !

కలం, వెబ్​ డెస్క్​ : ఇటీవల రాష్ట్ర డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు (Maoist Leaders) నేడు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం కానున్నారు. ఈ భేటీకి సంబంధించి అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

ముఖ్యమంత్రితో భేటీ కావడానికి ముందు డీజీపీ శివధర్ రెడ్డి ఐజీ సుమతి సీఎంను కలిసి ఈ ప్రక్రియపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో లొంగిపోయిన ప్రముఖ నేతలు దేవ్ జీ (Devji) అలియాస్​ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి అలియాస్​ సంగ్రామ్ (Sangram)​, చంద్రన్న, సుజాతక్క, దామోదర్ అలియాస్​ బడె చొక్కారావు, నూనె నరసింహారెడ్డి పాల్గొంటారు. ప్రభుత్వ సలహాదారుడు కే కేశవరావు కూడా ఈ చర్చల్లో భాగస్వామి అవుతుండటం విశేషం.

Read Also : లిక్కర్ క్వీన్ TO క్లీన్ క్వీన్ : కవిత పొలిటికల్ గేమ్ చేంజ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!