కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల (Bapatla) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓడరేవు–పిడుగురాళ్ల మార్గంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థిని (Engineering Student) సహస్ర (20) ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల వివరాల ప్రకారం, సహస్ర స్కూటీపై వెళ్తుండగా రోడ్డుపై ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెతో పాటు ఉన్న అఖిల్ అనే యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

