కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తిరుపతి లడ్డూ అంశంపై చర్చ కావాలంటూనే సభకు రాకుండా వైసీపీ(YSRCP) నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈరోజు సభలో వైసీపీ సభ్యుల అసలు స్వరూపం బయటపడిందని ఆయన వ్యాఖ్యానించారు.
“సభకు రావాలి, అల్లరి చేయాలి, బట్ట కాల్చి ముఖంపై వేయాలి, వాకౌట్ చేయాలి” అనే రాజకీయాలకు వారు అలవాటు పడ్డారు. సభలో మాట్లాడటం తక్కువ, బయట మాట్లాడటం ఎక్కువ అన్నట్లుగా వైసీపీ నేతల ధోరణి ఉంది. తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి అంశంపై చర్చించేందుకు వైసీపీకి ఆసక్తి లేదు. ప్రజల ఆందోళనలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, చర్చ నుంచి తప్పించుకుంటున్నారని పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) మండిపడ్డారు.

