కలం, వెబ్ డెస్క్: జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) అంశంపై పాకిస్థాన్ చేస్తున్న పసలేని ఆరోపణలను భారత్ అంతర్జాతీయ వేదికలపై ఎప్పటికప్పుడు సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 2026లో జరిగిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC) సమావేశంలో పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. జమ్ముకశ్మీర్లో అభివృద్ధి లేదని పాక్ ప్రస్తావించగా, భారత్ గట్టి జవాబుచ్చింది. జమ్ముకశ్మీర్లో అభివృద్ధిని చూడట్లేదంటే.. పాక్ ఊహల్లో ఉన్నట్లే అని భారత ప్రతినిధి అనుపమా సింగ్ సెటైర్లు వేశారు. పాకిస్తాన్ (Pakistan) అబద్ధపు ప్రచారంతో బతుకుతోందని ఘాటుగా విమర్శించారు.
జమ్ముకశ్మీర్ అభివృద్ధి బడ్జెట్, పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి కోరిన ప్యాకేజీ కంటే రెండింతలు ఎక్కువ ఉందని భారత్ గుర్తుచేసింది. జమ్ముకశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని, అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే పాక్ ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తోందని భారత ప్రతినిధులు స్పష్టం చేశారు. పొరుగుదేశం తమ అంతర్గత సంక్షోభంపై దృష్టి పెట్టాలని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపాలని హెచ్చరించింది. కాశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని, పాక్ నియంత్రణలోని భూభాగాలను ఖాళీ చేయాలని భారత్ తేల్చిచెప్పింది.

