కలం, వెబ్ డెస్క్: ఐపీఎస్ అధికారి, ఏపీ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ (PV Sunil Kumar) కుమార్ ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన రఘురామ కృష్ణ రాజు (Raghurama Krishna Raju)పై తీవ్ర ఆరోపణలు చేశారు. కస్టోడియల్ టార్చర్ కేసులో తప్పుడు సాక్ష్యం ఇవ్వాలని రఘురామ ఐపీఎస్ సునీల్ నాయక్‌ను బెదిరింపులకు గురి చేసినట్లు పేర్కొన్నారు. సునీల్ నాయక్ చేసిన ఎక్స్ పోస్టును షేర్ చేస్తూ సునీల్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకు సంబంధించి మాజీ సీఎం, సునీల్ కుమార్‌కు వ్యతిరేకంగా మాట్లాడాలని, లేదంటే తనను కూడా ఈ కేసులో ఇరికిస్తామన్నారని సునీల్ నాయక్ చెప్పారు. ఈ విషయంపై విచారణ చేపట్టాలని అధికారులను కోరారు. తన ఆరోపణలను నిర్ధారించడానికి కాల్ డీటెయిల్ రికార్డులు, ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటెయిల్ రికార్డులు పరిశీలించాలని సూచించారు.
రఘురామ ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తున్న పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారని సునీల్ కుమార్ (PV Sunil Kumar) చెప్పారు. ఈ మేరకు పలు కేసుల నంబర్లను ప్రస్తావించారు. రూ.947 కోట్ల మోసానికి సంబంధించి RCBD1/2019/E/0003 కేసు, రూ.238 కోట్లకు సంబంధించి RCBD1/2021/E/0002 కేసుతో పాటు రఘురామపై కొన్ని బ్యాంకు మోసం కేసులు కూడా ఉన్నాయన్నారు. తన ఆరోపణలు నిజమైతే ఈ కేసుల్లో ఉన్న సాక్షులను కూడా రఘురామ ప్రభావితం చేయడానికి, బెదిరించడానికి అవకాశం ఉందని సునీల్ అభిప్రాయపడ్డారు. అలాంటి పరిస్థితిలో సాక్షులను రక్షించడానికి నిందితుడిని అరెస్ట్ చేయడం ఒక్కటే మార్గమని ఆయన తెలిపారు.
Read Also : ఐపీఎస్ సునీల్ నాయక్‌పై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ
Follow Us On: Instagram

