epaper
Sunday, March 1, 2026
epaper

ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు బదిలీ

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) లోని వెలుగుమట్ల అక్రమ నిర్మాణాల తొలగింపులో కీలకంగా వ్యవహరించిన ఆర్డీఓ (RDO) గురువారం బదిలీ అయ్యారు. కేటిఆర్.. ఖమ్మం పర్యటన నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నిన్న రాత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెలుగుమట్ల (Velugumatla) నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.

తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) బాధితుల పరామర్శ నేపథ్యంలోనే కూల్చివేతల్లో కీలకంగా వ్యవహరించిన ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు (Narasimha Rao) అర్ధాంతరంగా బదిలీ అయ్యారా అనే అనుమానం స్థానికుల్లో వ్యక్తం అవుతుంది. ఖమ్మం ఆర్డీవో నరసింహారావు మెట్‌పల్లి (Metpally)కి బదిలీ అయ్యారు. కూల్చివేతల బాధితులు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలో, బాధితులను శాంతింప చేయడానికి బదిలీ చేశారనే అనుమానాలు కూడా స్థానికంగా వ్యక్తం అవుతున్నాయి. కాగా మెట్‌పల్లి ఆర్డీఓ శ్రీనివాస్ రావును ఖమ్మం ఆర్డీఓ గా బదిలీ చేసినట్టు తెలుస్తోంది.

Read Also : సోషల్ మీడియా బ్యాన్: పిల్లల ఫ్యూచర్ పై ఇండియా అడుగులు ఎటు?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!