కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) మార్కెట్ యార్డు కార్యాలయంపై పసుపు రైతులు (Turmeric Farmers) దాడికి దిగారు. మెయిన్ గేట్ వద్ద ఉన్న భవనం అద్దాలు ధ్వంసం చేశారు. పసుపు విక్రయాల జాప్యంపై నిరసన తెలిపిన రైతులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షంతో పాటు ఇతర కారణాలతో మార్కెట్కు సెలవులు, కొనుగోళ్లు తీవ్ర జాప్యం అవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన పసుపుతో తామే నష్టపోయే పరిస్థితులు వస్తున్నాయని అంటున్నారు. వసతులు టార్ఫాలిన్ లు కావాల్సినన్ని లేక ఇబ్బందులు అవుతున్నాయని తమను పట్టించుకునే నాథుడే లేడని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆందోళనకు దిగిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. సిబ్బంది పోలీసులు సముదాయించి పంపించారు. కొనుగోళ్లు వేగవంతం చేస్తామని అధికారుల ప్రకటనతో రైతులు శాంతించి ఆందోళన విరమించారు.
Read Also : ఖమ్మంలో ఇండ్ల కూల్చివేత దారుణం : ఈటల రాజేందర్
Follow Us On: Instagram

