కలం, వెబ్ డెస్క్: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లోని బీజాపూర్ (Bijapur) జిల్లాలో మరోసారి భద్రతా బలగాలు, మావోయిస్టుల (Maoists)కు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇంద్రావతి నది పరిధిలో గురువారం ఉదయం జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టులు నదీ తీరంలో ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు, పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల అనంతరం ఆ ప్రాంతాన్ని పరిశీలించగా ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనా స్థలంలో భారీ ఎత్తున రైఫిళ్లు, ఆయుధాలు, పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఇంకా కూంబింగ్ కొనసాగుతోంది. పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. దేశంలో మావోయిస్టులను పూర్తిగా తొలగిస్తామన్న కేంద్రం ఆపరేషన్ కగార్‌ను వేగవంతం చేసింది. మార్చి 31 వరకు భారత్‌ను మావోయిస్టులు లేని దేశంగా ప్రకటించేందుకు సిద్ధమైంది.

