కలం, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సోషల్ మీడియాలో సరికొత్త మైలురాయిని అధిగమించారు. ఇన్స్టాగ్రామ్ (Instagram) ప్లాట్‌ఫామ్‌పై 100 మిలియన్ల ఫాలోవర్ల మార్కును దాటిన తొలి ప్రపంచ నాయకుడిగా, రాజకీయవేత్తగా ఆయన రికార్డు సృష్టించారు. 2014లో ఈ ప్లాట్ఫామ్లో చేరిన మోదీ, అనతి కాలంలోనే ప్రజాదరణను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఫాలోవర్ల సంఖ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే రెండు రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం.
ప్రపంచంలోని ఇతర అగ్రనేతలతో పోలిస్తే మోదీ (Narendra Modi) హవా స్పష్టంగా కనిపిస్తోంది. ట్రంప్ 43.2 మిలియన్ల ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో (15 మిలియన్లు), బ్రెజిల్ అధ్యక్షుడు లూలా (14.4 మిలియన్లు), టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ (11.6 మిలియన్లు), అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ (6.4 మిలియన్లు) కొనసాగుతున్నారు. విచిత్రమేమిటంటే, ఈ ఐదుగురు ప్రపంచ నేతల మొత్తం ఫాలోవర్ల సంఖ్య కలిపినా ప్రధాని మోదీ ఒక్కరి ఫాలోవర్ల సంఖ్య కంటే తక్కువగానే ఉంది.
Read Also: సోషల్ మీడియా బ్యాన్: పిల్లల ఫ్యూచర్ పై ఇండియా అడుగులు ఎటు?
Follow Us On: Youtube

