కలం, వెబ్ డెస్క్: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుకలు ఉదయ్‌పూర్‌లో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ నటి కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) ఈ వేడుకల్లో పాల్గొని, పెళ్లికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. బుధవారం జరిగిన హల్దీ, సంగీత్ వేడుకల ఫోటోలను షేర్ చేస్తూ.. తనకు ఇష్టమైన ‘లవ్ స్టోరీ’ని సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆమె హల్దీ వేడుకలో పసుపు రంగు దుస్తుల్లో సందడి చేశారు. ఫిబ్రవరి 26 ఉదయం 8 గంటలకు విజయ్-రష్మికల వివాహం (Marriage) జరగనుండగా, ఇప్పటికే కళ్యాణితో పాటు తరుణ్ భాస్కర్, రాహుల్ రవీంద్రన్ పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.

