కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi), అగ్రనేత రాహుల్ గాంధీలను ప్రత్యేకంగా కలుసుకున్నారు. మార్చి 5న హైదరాబాద్లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు రావాల్సిందిగా కోరారు. పెళ్లి పత్రికను అందజేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క కుటుంబసభ్యులతో సోనియా (Sonia Gandhi), రాహుల్ గాంధీలు (Rahul Gandhi) కాసేపు ముచ్చటించారు. కాబోయే నూతన వధూవరులకు వారు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.
తన కుమారుడి పెళ్లి నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి (Bhatti Vikramarka) గత పదిరోజులుగా బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆయన కేంద్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులను పెళ్లికి ఆహ్వానించారు. తాజాగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీని కలిసి ఇన్విటేషన్ అందజేయడంతో రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత ఏర్పడింది.
Read Also: కాంగ్రెస్ సర్కార్ తీర్చిన కాళేశ్వరం అప్పు… రెండేళ్లలోనే రూ. 47 వేల కోట్లు
Follow Us On : WhatsApp

