epaper
Sunday, March 1, 2026
epaper

క‌ల్తీ పాల కేసులో వెలుగులోకి సంచ‌ల‌న విష‌యాలు!

క‌లం, వెబ్ డెస్క్‌: రాజ‌మండ్రి (Rajahmundry) క‌ల్తీ పాల కేసులో ద‌ర్యాప్తు చేస్తున్న కొద్దీ సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. పాల వ్యాపారి గ‌ణేష్ చేసిన దారుణాల‌ను ఒక్కొక్క‌టిగా పోలీసులు గుర్తిస్తున్నారు. పాల విష‌యంలో అన్నీ తెలిసే గ‌ణేష్ త‌ప్పు చేసిన‌ట్లు పోలీసులు భావిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 15న గ‌ణేష్ గ‌డ్డ‌క‌ట్టిన పాల‌ను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేశాడు. ఈ పాల‌నే త‌న క‌స్ట‌మ‌ర్లు అయిన‌ 105 కుటుంబాల‌కు అమ్మాడు. పాలు తాగిన త‌ర్వాత ప‌లువురు చేదుగా ఉన్నాయ‌ని ఫిర్యాదు చేశారు. గ‌ణేష్ బావ గంగాధ‌ర్ కూడా త‌న తీరుపై హెచ్చ‌రించాడు. బావ మాట‌లు లెక్క చేయ‌కుండా గ‌ణేష్ అలాగే పాల విక్ర‌యం కొన‌సాగించాడు. గ‌ణేష్ 11 ఏళ్లుగా అనుమ‌తి లేకుండా వ‌ర‌ల‌క్ష్మి డెయిరీ నిర్వ‌హిస్తున్నాడు. వినియోగ‌దారుల ఫిర్యాదుతో పోలీసులు గ‌ణేష్‌ను ఇప్ప‌టికే అదుపులోకి తీసుకున్నారు. ప్ర‌స్తుతం గ‌ణేష్ రాజ‌మండ్రి జైలులో ఉన్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!