epaper
Sunday, March 1, 2026
epaper

యూట్యూబర్​ కోమలి ఆత్మహత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా..?

కలం, వెబ్​ డెస్క్​ : మణికొండ చిత్రపురి కాలనీకి చెందిన యూట్యూబర్ కోమలి బోను(21) (YouTuber Komali) ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర విషాదాన్ని నింపింది. మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతున్న కోమలి, తన వీడియోలతో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ యూట్యూబ్ వీడియోలు చేసే అఖిల్ రెడ్డితో ఆమెకు పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. మూడేళ్ల పాటు సాఫీగా సాగిన వీరి బంధం, ఏడాది క్రితం తలెత్తిన మనస్పర్థల కారణంగా విడిపోయారు.

అఖిల్ రెడ్డితో విడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన కోమలి (YouTuber Komali) మనస్తాపానికి గురైంది. గతంలోనూ ఆమె ఒకసారి ఆత్మహత్యాయత్నం చేయగా, కుటుంబ సభ్యులు గమనించి ఆమెను కాపాడారు. అయితే రెండు రోజుల క్రితం ఆమె అఖిల్ రెడ్డికి ఫోన్ చేయగా, ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో తీవ్ర మనోవేదనకు లోనైన కోమలి, సోమవారం అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!