epaper
Monday, March 2, 2026
epaper

ది ప్యారడైజ్ నుంచి ఆయా షేర్ సాంగ్ రిలీజ్

కలం, డెస్క్ : నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ ది ప్యారడైజ్ (The Paradise). 2026 ఆగస్టు 21న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే మూవీ నుంచి రిలీజ్ అయిన లుక్స్, టీజర్ భారీ హైప్ పెంచేశాయి. మంగళవారం నాని పుట్టిన రోజు సందర్భంగా మూవీ నుంచి ఆయా షేర్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో నాని మాస్ లుక్స్ అదిరిపోయాయి. అలాగే సెట్స్, విజువల్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి.

పెద్ద పాత్రలో బిర్యానీ తీసుకురావడం, నాని పాత్రకు ఇచ్చిన హైప్, ఆనాటి రోజులను సింక్ చేసేలా స్క్రీన్ కలర్ అవన్నీ కొత్త అనుభూతిని పంచేలా ఉన్నాయి. ఆయా షేర్ అంటూ సాగిన లిరిక్స్ కూడా బాగానే ఉన్నాయి. ఈ పాటలో నాని పాత్ర స్వభావం ఏంటో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల చూపించారు. విజువల్స్, సీన్లు చూస్తుంటే పీడిత ప్రజల తరఫున నాని సాగించే పోరాటం చుట్టూ కథ ఉంటుందని అర్థం అవుతోంది. మరి సాంగ్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!