epaper
Monday, March 2, 2026
epaper

సీఎం రేవంత్‌కు ఉద్యోగ సంఘాల థాంక్స్..

కలం, డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డిని (Revanth) ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంఘాల నేతలు ఆయన నివాసంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తమ చిరకాల వాంఛను నెరవేర్చారంటూ సీఎం రేవంత్ రెడ్డికి (Revanth)  కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.1.20 కోట్ల ప్ర‌మాద బీమా వ‌ర్తింపుతో పాటు రూ.1,056 కోట్ల నిధులతో ఉద్యోగులు, వారి కుటుంబాలకు క్యాష్ లెస్ హెల్త్ కార్డులకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసందే. వీటిపై తాజాగా ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల లీడర్లు మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన బీమా పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని చెప్పారు. 1,998 వ్యాధుల‌కు క్యాష్ లెస్ ట్రీట్ మెంట్లు అందించడం అంటే.. ఉద్యోగులకు వారి కుటుంబాలకు గొప్ప అవకాశం అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని క్యాబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలుస్తాయని ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల లీడర్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో ఉద్యోగ‌, ఉపాధ్యాయ‌, పెన్ష‌న‌ర్ల ఐకాస‌ నాయ‌కులు మారం జ‌గ‌దీశ్వ‌ర్‌, ఏలూరి శ్రీ‌నివాస‌రావు, పి.దామోద‌ర్ రెడ్డి (పీఆర్‌టీయూ), చావా ర‌వి (యూటీఎఫ్‌), కే.వెంక‌టేశ్వ‌ర్లు (టీఎన్జీవో), ఉపేంద‌ర్ రెడ్డి (టీజీవో), జి.స‌దానంద‌గౌడ్ (ఎస్టీయూ), ఉమాదేవి (పెన్ష‌న‌ర్స్‌), వి.ర‌వీంద‌ర్ రెడ్డి (రెవెన్యూ), గిరి శ్రీ‌నివాస్ రెడ్డి (సెక్ర‌టేరియ‌ట్‌), ఖాద‌ర్ (ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్‌), టి.లక్ష్మ‌న్ (ఎక్సైజ్‌), తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మ‌న్ వి.ల‌చ్చిరెడ్డి , కె.రామ‌కృష్ణ (డిప్యూటీ కలెక్ట‌ర్ల సంఘం), ఎస్‌.రాములు, ర‌మేష్ పాక‌, సీహెచ్‌.శ్రీ‌నివాస్ (తెలంగాణ త‌హ‌శీల్దార్స్ అసోసియేష‌న్‌), బాణాల రాంరెడ్డి, వి.భిక్షం (తెలంగాణ రెవెన్యూ స‌ర్వీసెస్ అసోసియేష‌న్‌), డా.నిర్మ‌ల‌, ఎల్‌.ద‌శ‌ర‌థ్‌(టీజీసీపీఎస్ఈయూ), గ‌రికె ఉపేంద‌ర్‌రావు (జీపీవో), సుగంధిని (హెచ్ఎండ‌బ్ల్యూఎస్ అండ్ ఎస్‌డ‌బ్ల్యూ), భూమేశ్‌, సునీల్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!