epaper
Sunday, March 1, 2026
epaper

దారుణం.. 2 నెలల బిడ్డను పొయ్యిలో వేసి చంపిన తల్లి

కలం, డెస్క్ : సభ్య సమాజమే నివ్వెరపోయే ఘటన ఇది. తల్లికి మించిన దైవం లేదంటారు. కానీ ఈ మధ్య కన్న తల్లులే బిడ్డలను అత్యంత కిరాతకంగా చంపేస్తున్నారు. ఇప్పుడు మేడ్చల్ (Medchal) జిల్లాలో జరిగిన ఘటన ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేస్తోంది. దుండిగల్ పరిధిలోని బౌరంపేటలో ఓ తల్లి తన 2 నెలల కొడుకును పొయ్యిలో వేసి చంపేసింది. శిశువు ఏడవకుండా నోట్లో గుడ్డలు కుక్కింది.. కాళ్లు కట్టేసింది.. ఎవరూ లేనిది చూసి కట్టెల పొయ్యిలో వేసింది. అది చూసిన తండ్రి తీవ్రంగా కుమిలిపోయాడు. తన భార్యతో పెద్ద ఎత్తున గొడవ పడ్డాడు.

ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇంతటి రాక్షసత్వాన్ని చూపించిన తల్లిని అత్యంత కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే తల్లి ఇంతటి దారుణానికి ఎందుకు పాల్పడిందో తెలియాల్సి ఉంది. భార్య, భర్తల మధ్య ఏవైనా గొడవలు ఉన్నాయా, ఆమె మానసిక పరిస్థితి బాగా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బీహార్ కు చెందిన ఈ జంట బౌరంపేటలో కన్ స్ట్రక్షన్ లో ఉన్న సైట్ లో పనిచేస్తున్నారు.

Read Also: ఇన్ స్టాలో వీడియోలు.. యువకుడిపై సర్పంచ్ దాడి..

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!