కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ (Amberpet)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య (Family Suicide) చేసుకున్నారు. మృతులను రామ్‌రాజ్ (55) మాధవి (50), శశాంక్ (24)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంట్లో పరిసరాలను పరిశీలించారు. ఆర్థిక ఇబ్బందులతోనే ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న రామ్‌రాజ్ సన్నిహితులు ఇంటికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Read Also: యూపీ మర్డర్ కేస్.. ఒకే కుటుంబంలో 13 మందికి జీవిత ఖైదు
Follow Us On: Instagram

