కలం, వెబ్ డెస్క్: నేడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత (Jayalalithaa) జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) ఆమెను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ట్రిబ్యూట్ టు అమ్మ జయలలిత జీ అంటూ ఓ స్పెషల్ వీడియో షేర్ చేస్తూ ఆమె సేవలను కొనియాడారు. జయలలిత ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న దమ్మున్న నాయకురాలు అని, గొప్ప పరిపాలకురాలని ప్రధాని పేర్కొన్నారు. జయలలిత జీవిత ప్రయాణం ధైర్యం, సంకల్ప బలంతో నిండినదని అభివర్ణించారు. ఆమె తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మహిళా సాధికారత, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి సంక్షేమ పరిపాలన అందించారని మోడీ గుర్తు చేశారు. ఆమె నిర్ణయాల్లో ఖచ్చితత్వం ఉండేదని, అలాగే ప్రజల పట్ల అపారమైన కరుణ కలిగిన నాయకురాలని తెలిపారు. తనకు జయలలితతో జరిగిన సమావేశాలను స్మరించుకుంటూ, ఆ జ్ఞాపకాలు తనకు ఎంతో ఆనందాన్నిస్తాయని తెలిపారు. ఈ నెల ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో కూడా ఆమె గురించి ప్రస్తావించినట్లు ప్రధాని వెల్లడించారు.

