epaper
Tuesday, February 24, 2026
epaper

పవన్ చెప్పిన ఆ మాటకు థ్రిల్ అయ్యా : హరీష్‌ శంకర్

కలం, డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ ప్రస్తుతం హరీష్‌ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న మూవీ సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సినిమాలో పొలిటికల్ డైలాగులు ఉంటాయా అని పవన్ ఫ్యాన్స్ చాలా మంది పోస్టులు పెడుతున్నారు. వీటిపై తాజాగా హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. ‘పవన్ కల్యాణ్‌ సినిమాలను, రాజకీయాలను వేర్వేరుగానే చూస్తారు. ఆయన దృష్టిలో సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే. అందుకే సినిమాలో ఎవరినీ కించపరిచేలా డైలాగులు గానీ, సీన్లు గానీ ఉండొద్దని నాకు చెప్పారు. ఆయన మాటకు నిజంగా థ్రిల్ అయిపోయా’ అంటూ చెప్పుకొచ్చాడు హరీష్‌ శంకర్.

పవన్ కల్యాణ్‌ కు ప్రకాశ్ రాజ్ తో సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నప్పటికీ.. ఆయనతో నటిస్తున్నారని.. అదే పవన్ వ్యక్తిత్వం అంటూ తెలిపారు హరీష్‌. పవన్ కల్యాణ్‌ సిద్ధాంతాలను ఫాలో అవుతున్న వారు కూడా గ్రేట్ అని.. అందుకే ఆయన అభిమానులు అంత బాధ్యతతో ఉంటారని చెప్పాడు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్-పవన్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడంతో.. దీనిపై బాగానే అంచనాలు ఉన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>