కలం, మెదక్ బ్యూరో: ఉమ్మడి మెదక్ (Medak) జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురవడంతో తీవ్ర పంట నష్టం జరిగింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక, మిరుదొడ్డి మండలాల్లో వడగండ్ల వర్షం కురిసింది. దీంతో మామిడి తోటలు, మొక్కజొన్న, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. అలాగే మెదక్ జిల్లా చేగుంట, నార్సింగి మండలాల్లో వర్షం కురిసింది. ధర్మారంలో భారీ ఈదురు గాలులకు రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. పశువులకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో దాదాపు 6 లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతు స్వామి ఆవేదన వ్యక్తం చేశాడు
మరో రెండు రోజులపాటు మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ అలర్ట్తో రైతులు (Farmers) తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షానికి నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.


